జమ్మలమడుగు డీఎస్పీని కలిసిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి బృందం
కడప జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వరరావును ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
/mlc-ramasubba-reddy-demands-unbiased-police-action-in-


కడప, 10 సెప్టెంబర్ (హి.స.) కడప జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వరరావును ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపడుతున్న బైండోవర్ కేసులపై వారు డీఎస్పీ దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వైఎస్సార్సీపీకి చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలను కూడా బైండోవర్ పేరుతో పిలిచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా యాక్టివ్గా ఉన్నవారిని ఏకపక్షంగా లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. గ్రామాల్లో . స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande