తిరుచానూరు అమ్మవారి సేవలో కేంద్ర సహాయ మంత్రి బన్వారీ లాల్ వర్మ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి బన్వారీ లాల్ వర్మ.. ఆలయ అధికారుల ఘన స్వాగతం.
union-minister-banwari-lal-verma-visits-tiruchanur-temple-183644


తిరుచానూరు, 10 సెప్టెంబర్ (హి.స.) తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖలో కేంద్ర సహాయ మంత్రి బన్వారీ లాల్ వర్మ ఈ రోజు గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande