
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో నాలుగో లైన్పై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
శుక్రవారం ఉదయం ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు 8 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నర్సీపట్నం, తుని, అన్నవరం, నిడదవోలు, రాజమండ్రి స్టేషన్లలో ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. ఇవాళ ఉదయం 9.15 గంటలకు కొవ్వూరు స్టేషన్లో రెండో ప్లాట్ఫామ్పైకి వచ్చిన వందేభారత్ రైలు నిలిచిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ