ఏపీలో తాగునీటి పథకాలు మళ్ళీ పునర్జీవం
రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్(జేజేఎం) కింద గతంలో రద్దయిన తాగునీటి పథకాలకు ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించింది.
AP Govt


అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్(జేజేఎం) కింద గతంలో రద్దయిన తాగునీటి పథకాలకు ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించింది.

రద్దయిన 13,252 పనులను పునరుద్ధరించడంతోపాటు, 13,247 సింగిల్ విలేజ్ స్కీములను 7,439 గ్రామాలవారీ పథకాలుగా పునర్య్వస్థీకరించేందుకు అనుమతి ఇచ్చింది. వీటితోపాటు ఐదు మల్టీ విలేజ్ స్కీములను కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది.

మొత్తం పనులకు అంచనా వ్యయం రూ.4053 కోట్లుగా నిర్ణయించింది. ఈమేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే జారీ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande