
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)
విశాఖ జిల్లా మధురవాడ పరిధి మారికవలస వద్ద ఓ అపార్ట్మెంట్లో గోరపల్లి చైతన్య (27) ఐటీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
మధురవాడ ఐటీ సెజ్లోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చైతన్య పనిచేస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందాడు. కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి. బాలకృష్ణ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ