స్వచ్ఛ వాయు సర్వేక్షణ లో గుంటూరుకు రెండో స్థానం
స్వచ్ఛ వాయు సర్వేక్షణ లో గుంటూరుకు రెండో స్థానం
Chandrababu Naidu(file)


అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)

స్వచ్ఛవాయు సర్వేక్షణ్లో గుంటూరుకు జాతీయ స్థాయిలో రెండో స్థానం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడువ్యాఖ్యానించారు.

నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీస్గా గుంటూరు, విజయవాడలోని వార్డులకు అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈరోజు (శుక్రవారం) కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పురపాలక, విద్యా, వైద్య ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు.

రూ.1.05 కోట్ల నగదు ప్రోత్సాహంతోపాటు... జాతీయ స్థాయిలో ఐదు అవార్డులను ఈ ఏడాది ఏపీ దక్కించుకుందని వెల్లడించారు. గుంటూరు, ఏలూరు, విజయనగరం, విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు నగరాల్లో అత్యుత్తమ పని తీరు చూపించాయని చెప్పుకొచ్చారు. నైపుణ్యాభివృద్ధి విషయంలో యువతకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో గుర్తించాలని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande