బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి పుతిన్.. నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. ఈ రోజు శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.
Putin Arrives in Delhi for BRICS Summit, Bilateral Meet With PM Modi Today sgr


న్యూఢిల్లీ, 11 సెప్టెంబర్ (హి.స.):18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. ఈ రోజు శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. పుతిన్ బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రసంగించడానికి ముందు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

పుతిన్ రాకతో భారత్-రష్యా సంబంధాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, రక్షణ, పెట్టుబడులు, రవాణా తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయ పరిణామాలు, ప్రాంతీయ భద్రత, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో పాటు ద్వైపాక్షిక సహకారంపై ఇరువురూ చర్చించే అవకాశం ఉంది.

ఆగస్టు 31న బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా కూడా మోదీ, పుతిన్ సమావేశమయ్యారు. కాగా, బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పలు ఇతర దేశాల నేతలతో కూడా సమావేశం కానున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసిలతో సహా ఇతర అంతర్జాతీయ నాయకులతో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande