హనుమకొండలో రైస్ మిల్లర్ల మహా ధర్నా
ఉమ్మడి వరంగల్ జిల్లా డిస్టిక్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతు మిల్లర్లు హనుమకొండ ఏకశిలా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు.
Rice Millers


వరంగల్, 11 సెప్టెంబర్ (హి.స.)

ఉమ్మడి వరంగల్ జిల్లా

డిస్టిక్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతు మిల్లర్లు హనుమకొండ ఏకశిలా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట సంపత్ కుమార్ మాట్లాడుతూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ అకస్మిక దాడులను వెంటనే నిలిపివేసి రెండు నెలల నుండి అన్యాయంగా రన్నింగ్ మిల్లర్ల పైన వేసిన కేసులను బెషరతుగా ఉపసంహరించుకొని మిల్లర్లతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని అన్నారు.

సీమ అగ్రిమెంట్ నిరూపక్షాలకు ఆమోదయోగంగా ఉండేలా రూపొందించి గతంలో ప్రభుత్వం చేసిన ఓటీఆర్ టెస్టు మిల్లింగ్ ప్రకారం కర్ణాటక సైంటిస్టుల రిపోర్టు ప్రకారంగా మాత్రమే బియ్యం తీసుకోవాలి అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బియ్యం రికవరీ శాతాన్ని నిర్ణయించాలని, క్వింటాల్ ధాన్యానికి మిల్లింగ్ ఛార్జీలను రా బియ్యానికి రూ.150, బాయిల్డ్ బియ్యానికి రూ.200కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

పాత గన్నీ బ్యాగ్ ధరను రూ.9గా నిర్ణయించడంతో పాటు పాత సంచులపై 20 శాతం తరుగుదలను తగ్గించాలని కోరారు.2014 నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్, డ్రైయేజ్, కస్టోడియన్ ఛార్జీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande