తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు (శనివారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Rain


కర్నూలు, 11 సెప్టెంబర్ (హి.స.)బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు (శనివారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని వివరించింది. నేటి నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దాంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ అల్పపీడన ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande