
తిరుపతి , 11 సెప్టెంబర్ (హి.స.) తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు జాతీయ రహదారి వద్ద గల కిన్నెర 45 హోటల్ కూడలి వద్ద కూలీలను తీసుకొని వెళ్తూ ఆగి ఉన్న ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొన్న పాల ట్యాంకర్ లారీ, ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పాల ట్యాంకర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అక్కడివారు తెలియజేస్తున్నారు.
వేగంగా లారీ అదుపుతప్పి ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిందని అక్కడి చుట్టుపక్కల ప్రజలు తెలియజేయడం జరుగుతుంది.
రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాల ట్యాంకర్ లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఈ కూడలి వద్ద ఇప్పటికే పలుమార్లు అనేక రోడ్డు ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారిందని వీటిని నివారించే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలేదని ఇప్పటికే ఇక్కడ పలుకు రోడ్డు ప్రమాదాలలో అనేక ప్రాణాలను కోల్పోవడం జరిగిందని కనీసం ఈ జాతీయ రహదారిపై ఈ కోడలి వద్ద భారీ కార్డులను ఏర్పాటు చేసే విధంగా కూడా అధికారులు పట్టించుకోవాలని అక్కడి ప్రజలు వాపోతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV