రేణిగుంట పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి!
రేణిగుంట పాఠశాలల వద్ద విద్యార్థుల భద్రతకు స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్న తల్లిదండ్రులు.
renigunta-news-parents-demand-speed-breakers-near-all-schools


రేణిగుంట , 11 సెప్టెంబర్ (హి.స.) రేణిగుంట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఎదురుగా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, విద్యార్థుల భద్రత కోసం పోలీస్ స్టేషన్ వీధిలోని ఓ ప్రైవేట్ పాఠశాల ముందు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు.

పాఠశాలల వద్ద విద్యార్థుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం ఉపయోగకరంగా ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే తరహాలో రేణిగుంట పట్టణంలోని అన్ని పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్లు, అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. పాఠశాలల ప్రారంభ, ముగింపు సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande