టీటీడీ నకిలీ అధికారులపై కేసు నమోదు.. వీఐపీ దర్శనం ఇప్పిస్తామని మోసం
టీటీడీ నకిలీ అధికారులపై కేసు నమోదు.. వీఐపీ దర్శనం ఇప్పిస్తామని మోసం
tirupathi-police-case-on-ttd-fake-officials-vip-darshan-fraud-


తిరుపతి, 11 సెప్టెంబర్ (హి.స.) టీటీడీలో సూపరింటెండెంట్లమంటూ భక్తులను బురిడీ కొట్టిస్తున్న ముగ్గురు వ్యక్తులపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధితుడి కథనం ప్రకారం.. తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ ప్రసన్నకుమార్ కుటుంబంతో తిరుమలకు చేరుకున్నారు. టీటీడీలో సూపరింటెండెంట్నంటూ చిన్నంగారి రమణ అనే వ్యక్తి ప్రసన్నను సంప్రదించాడు. వీఐపీ దర్శనం, గదులు ఇప్పిస్తానని చెప్పి బాధితుడి నుంచి రూ. 22వేలు వసూలు చేశాడు. ‘వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, సర్వర్ బిజీ అంటూ.. ’ రాత్రంతా కొండపైన అటూ ఇటూ తిప్పుతూ మానసిక వ్యథకు గురిచేశాడు. అడిగితే పొంతనలేని సమాధానం చెబుతూ ఇప్పుడే వస్తానని చెప్పి తప్పించుకున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు తిరుపతి ఈస్ట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande