
అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో-లారీ ఢీ కొనడంతో ముగ్గురు మృతిచెందారు. దత్తిరాజేరు మండలం షికారుగంటి జంక్షన్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతులు బాడంగి మండలం గజరాయనివలస వాసులుగా గుర్తించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ