నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ నేతలు వెలిగొండ ప్రాజెక్టును ఈరోజు (ఆదివారం) సందర్శించనున్నారు.
Velikonda project


అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)

తెలుగుదేశం పార్టీ నేతలు వెలిగొండ ప్రాజెక్టును ఈరోజు (ఆదివారం) సందర్శించనున్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు.

ఇంటింటికీ టీడీపీ నేతల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారిని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్తున్నారు. గుంటూరు నుంచి ప్రత్యేక బస్సుల్లో వెలిగొండ ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. ఈ ప్రాజెక్టు సందర్శన అనంతరం శ్రీశైలం మల్లన్న స్వామిని పశ్చిమ టీడీపీ నేతలు దర్శించుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande