
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినంత గట్టితనం ఆయన చేతల్లో ఉండదని ఏపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే గట్టితనం ఉంటే తెలంగాణలో ఈపాటికి ఎంతో మంది కటకటాల వెనక్కి వెళ్లిపోయేవారన్నారు. చాలా ఓపికగా ఎదురు చూసి ముందుకు పోయే స్వభావం కలిగిన వాడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇళ ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సీఎం చేత భూమి పూజ కార్యక్రం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన టీజీ వెంకటేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్యవైశ్యలంటే రేవంత్ రెడ్డికి చాలా గౌరవం ఉందన్నారు. గతంలో నేను సమైక్యఆంధ్ర పోరాటానికి శ్రీకారం చుట్టాను. అయితే అది మమ్మల్నీ బయటకు పంపొద్దని మీతో కలిసి ఉంచమని ఈ ఉద్యమాన్ని ప్రారంభించానన్నారు. తన పేరులో టీజీ ఉంటే తెలంగాణ రాగానే రాష్ట్రానికి సంక్షిప్త నామం టీజీ తొలగించి టీఎస్ గా మార్చారు. రేవంత్ రెడ్డి వచ్చి మళ్లీ టీజీ తీసుకువచ్చి మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని మా తాత ముత్తాతలు తెలంగాణ నుంచి వచ్చిన వారేనన్నారు. ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ.కోటి ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్యవైశ్యులకు పదవులు ఇవ్వాలని టీజీ వెంకటేశ్ కోరారు. రాజకీయంగా ఏదైనా పోరాటాల్లో వైశ్యులు ముందుకు రారు అనే అభిప్రాయం ఉందని కానీ ప్రభుత్వాలను మార్చడంలో పబ్లిక్ టాక్ చేయడంలో మావారు ఆరితేరినవారు అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..