ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో అప్ డేట్.. మాజీ హవిల్దార్ మల్లేశ్ పోలీసు కస్టడీకి అనుమతి
మాజీ హవిల్దార్ మల్లేశ్ ను కస్టడీకి తీసుకునేందుకు సికింద్రాబాద్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
Army weapons


హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)

సికింద్రాబాద్లోని బొల్లారం (Bollaram) ఆర్మీ మద్రాస్ రెజిమెంట్లో కలకలం సృష్టించిన ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవిల్దార్ మల్లేశ్ (Mallesh)ను కస్టడీకి తీసుకునేందుకు సికింద్రాబాద్ కోర్టు (Secunderabad Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు అనుమతితో ఎల్లుండి నుంచి నిందితుడు మల్లేశ్ను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.

ఈ సంచలన చోరీ కేసులో మల్లేశ్తో పాటు మరికొంత మంది అనుమానితులను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఆర్మీ రెజిమెంట్ నుంచి ఆయుధాలు ఎలా మాయమయ్యాయి.. ఈ కుట్ర వెనుక ఏమైనా పెద్ద నెట్వర్క్ ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీయనున్నారు. ముఖ్యంగా దొంగిలించిన ఆయుధాలను మల్లేశ్ ఎవరికి అమ్మాలనుకున్నాడు? ఎవరికి అప్పగించేందుకు ప్లాన్ చేశారనే అంశాలపై లోతుగా ఇన్వేస్టిగేట్ చేయనున్నారు. విచారణలో భాగంగా మల్లేశ్ వెల్లడించే కీలక సమాచారాన్ని రాష్ట్ర పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు రిపోర్టు రూపంలో హ్యాండోవర్ చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande