విగ్రహం ఎంత పెద్దది పెట్టామన్నది ముఖ్యం కాదు.. ఎంత భక్తిశ్రద్ధలతో పూజించామన్నదే ప్రధానం.. హరీష్ రావు
విగ్రహం ఎంత పెద్దది పెట్టామన్నది ముఖ్యం కాదు.. ఎంత భక్తిశ్రద్ధలతో పూజించామన్నదే ప్రధానం.. హరీష్ రావు
హరీష్ రావు


సిద్దిపేట, 13 సెప్టెంబర్ (హి.స.)

విఘ్నేశ్వరుడు దేవుడే కాకుండా ప్రజలందరికీ మార్గదర్శకుడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వినాయక విగ్రహాన్ని ఎంత పెద్దగా పెట్టామన్నది ముఖ్యం కాదని.. ఎంత భక్తిశ్రద్ధలతో పూజించామన్నదే ముఖ్యమన్నారు. ఊరికి ఒక మట్టి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజించాలని తాను గతంలో చెప్పానని గుర్తు చేశారు. ఏ గ్రామంలోనైనా, వార్డులోనైనా ఒక్కటే ఒక మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే తాను పర్మినెంట్ షెడ్డు నిర్మించి ఇస్తానని పిలుపునిచ్చారు...

రసాయనాలతో కూడిన వినాయకులను చెరువులో నిమజ్జనం చేయడంతో నీళ్లలో ఉండే జీవరాశులు చనిపోవడంతోపాటు భూమి కలుషితమై ప్రజా ఆరోగ్యానికి కీడు చేసే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు... వినాయకుడి రూపంలోనే మనకు ఎన్నో సందేశాలు ఉన్నాయి. ఆయన పెద్ద తల గొప్పగా ఆలోచించమని చెబుతుంది... పెద్ద చెవులు ప్రజల మాట వినాలని చెబుతాయి... అందుకే గణపతి కేవలం పూజించే దేవుడు మాత్రమే కాదు... మన జీవితానికి మార్గదర్శకుడన్నారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande