పార్టీలో మమ్మల్ని టార్గెట్ చేశారు.. కొండా సురేఖ
పార్టీలో మమ్మల్ని టార్గెట్ చేశారు.. కొండా సురేఖ
కొండా


వరంగల్, 13 సెప్టెంబర్ (హి.స.)

పదవులు వస్తుంటాయ్.. పోతుంటాయ్, ప్రజల్లో ఉండేవాళ్లే అసలైన నాయకులని అన్నారు. ఇవాళ వరంగల్ నగరంలో నిర్వహించిన కార్యకర్తలు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తాను ఎంపీటీసీ నుంచి మంత్రి స్థాయికి ఎదిగానని అన్నారు.

కష్టకాలంలో కార్యకర్తలంతా తన వెన్నంటి నిలిచారని పేర్కొన్నారు. గతంలో ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆ బంధం అలా కొనసాగేదని.. ఇప్పుడు అవకాశవాద రాజకీయం పెరిగిపోయిందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొండా ఫ్యామిలీకి గుర్తింపు ఉందన్నారు. వైఎస్ జగన్ కోసం క్షణం ఆలోచించకుండా మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. వైఎస్ ఉన్నన్నాళ్లు తమను కంటికిరెప్పలా కాపాడారని కామెంట్ చేశారు.

తనపై ఢిల్లీ (Delhi)కి ఫిర్యాదులు ఇచ్చేవాళ్లు ఉన్నారని వైఎస్ అనేవారని, ఆయన చనిపోయాక పార్టీలోని కొందరు తమను టార్గెట్ చేశారని తెలిపారు. రాష్ట్రం విడిపోయాక కేసీఆర్ (KCR) తమను పిలిచి అవకాశం ఇచ్చారని, వరంగల్ ఈస్ట్లో పరిస్థితులను మీరైతేనే సెట్ చేయగలరని ఆయన అన్నట్లు పేర్కొన్నారు. కానీ, పరకాలను వదిలి వెళ్లడం తమదే పొరపాటని అన్నారు. నాడు రేవంత్ అన్న రైతుల కోసం పాదయాత్ర చేస్తే మొదట సపోర్టు ఇచ్చింది తానేనని కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ లాంటి మాస్ లీడర్ కావాలని కోరుకున్నది తానేనని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande