మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి అన్నారు
MLA


మెదక్, 13 సెప్టెంబర్ (హి.స.)

వినాయక చవితి సందర్భంగా

ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మట్టి వినాయకుల ప్రతిమలను పూజించడం ద్వారా భక్తిభావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా చేయూతనిచ్చిన వారమవుతామని అన్నారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారయ్యే విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande