
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలకు,
న్యాయవాదులకు న్యాయసేవలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో తలపెట్టిన నూతన జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది.
మండల పరిధిలోని కండ్లకోయ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సమగ్ర కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులకు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ టి. విజయసేన్ రెడ్డి, జస్టిస్ నందికొండ నర్సింగరావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తికావడం ద్వారా న్యాయవాదులతో పాటు కక్షిదారులకు ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, కేసుల విచారణ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అతిథులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు