
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)
ఓ హోటల్లో రైడ్ చేసిన పోలీసులు ఓ విదేశీ మహిళను రక్షించి, ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్పహాడ్లో జరిగింది. ఇన్స్పెక్టర్ సంజీవులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యభిచారం జరుగుతుందనే విశ్వసనీయ సమాచారంతో గగన్పహాడ్లోని ఓ హోటల్పై గత రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విదేశీ మహిళను రక్షించారు. అదేవిధంగా వ్యభిచారానికి పాల్పడుతున్న ముగ్గురు విటులను అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ సంజీవులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు