బొమ్మలాపురంలో ఆవుల మందపై పెద్దపులి దాడి
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురంలో పెద్దపులి సంచారం.
బొమ్మలాపురంలో ఆవుల మందపై పెద్దపులి దాడి.. తీవ్ర గాయాలు!


మార్కాపురం , 13 సెప్టెంబర్ (హి.స.)మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామంలోని ఊరకొండ సమీపంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

ఆవుల మందపై ఒక్కసారిగా దాడి చేసిన పులి.. ఓ ఆవుపై దాడి చేయడంతో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి.

పులి దాడిని గమనించిన ఆవుల కాపరులు అప్రమత్తమై అక్కడి నుండి తరలించారు .

ఈ ఘటనతో బొమ్మలాపురం గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు ఆందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు స్పందించి పులి సంచారంపై నిఘా ఏర్పాటు చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande