వినాయక నిమజ్జన ఏర్పాట్లు పూర్తి: డీజే నిషేధం...తిరుపతి ఆర్డీవో, డీఎస్పీ
వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని తిరుపతి రూరల్ మండలంలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహాలను తిరుచానూరు లోని రామక్క చెరువు, పేరూరు చెరువులో నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీవో రామ్మోహన్, డిఎస్పీ ప్రసాద్ తెలిపారు.
తిరుపతి ఆర్డీవో, డీఎస్పీ


తిరుపతి, 13 సెప్టెంబర్ (హి.స.) వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని తిరుపతి రూరల్ మండలంలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహాలను తిరుచానూరు లోని రామక్క చెరువు, పేరూరు చెరువులో నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీవో రామ్మోహన్, డిఎస్పీ ప్రసాద్ తెలిపారు.

ఈ రోజు నారాయణాద్రి రోడ్డు సమీపంలో రామక్క చెరువు పరిసరాలను వారు అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ.... వినాయక నిమజ్జనం మొదటిరోజు, 3వ రోజు లోపే పూర్తి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అల్లర్లు, డిజేలు లేకుండా నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.

వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, మండపాల వద్ద డిజేలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రదేశంలో విద్యుత్ లైట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామ్మోహన్, డి.ఎస్.పి ప్రసాద్, డి.ఎల్.పి .ఓ. సురేష్ నాయుడు, సీఐ సునీల్ కుమార్, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande