
అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించారు. స్థానిక పీఎస్లో విధులు నిర్వర్తిస్తున్న బి.సత్యనారాయణ తుపాకీతో కాల్చుకున్నారు.
తీవ్రగాయాలు కావడంతో ఆయన్ను అరకులోయ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ