
అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)
శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ పురపాలక సంఘంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన ఓటర్ జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేశారు.
కార్యాలయంలో కమిషనర్ ఈ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జాబితాలను నోటీసు బోర్డులో పెట్టారు పలాస ఎంఆర్ఓ, ఆర్టీవో కార్యాలయంలో జాబితాలు అందుబాటులో ఉంచారు. జాబితాలో కులాలపై అభ్యంతరాలు ఉంటే కార్యాలయంలో తెలియజేయాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ