
అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలోని డిస్నీల్యాండ్కు సంబంధించిన 57 ఎకరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒకరికే కాకుండా పలు ప్రాజెక్టులకు కేటాయించనున్నారు. గతంలో డిస్నీల్యాండ్ను నడిపిన సంస్థకు తొలుత ఐదు ఎకరాలను ఇక్కడ కేటాయించడానికి నివేదికలు సిద్ధమయ్యాయి. తాము డిస్నీ పూర్తిస్థాయిలో ఇక్కడ గతంలో మాదిరిగానే డిస్నీల్యాండ్ను ఏర్పాటు చేస్తామంటూ సదరు సంస్థ తాజాగా ప్రతిపాదన పెట్టింది. మొత్తం స్థలమంతా అవసరం లేదని, తమకు ఐదు ఎకరాలు ఇవ్వాలంటూ కోరింది. దీంతో తొలుత ఈ సంస్థకే ఐదు ఎకరాలను కేటాయించనున్నారు. మిగతా 52 ఎకరాలను సైతం పీపీపీ విధానంలో పర్యాటక ప్రాజెక్టులకు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే డిస్నీల్యాండ్ మాదిరిగానే కడతామంటూ మరికొందరు సైతం ముందుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ