
అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)
అనకాపల్లి మండలం సిరసపల్లిలో చింతామణి దత్తక్షేత్రంలో 16 వేల మొక్కలతో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు.
పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా వినాయక ప్రతిమతోపాటు పరిసర ప్రాంతాలను మొక్కలతో అలంకరించారు.
60 వేల మొక్కలతో ఏర్పాటుచేసిన మండపం, ప్రతిమను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వినాయక చవితి రోజున సోమవారం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు సస్యగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఇక్కడ ప్రత్యేక పూజలు జరిగాయి. దేవి శ్రీదేవి ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలో చింతామణి దత్త క్షేత్రం ఆధ్వర్యంలో వినాయక చవితి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ