ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు......సీఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం తన భార్య భువనేశ్వరి, మనవడు దేవాంశ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో పూజలు నిర్వహించారు.
AP CM


ఆంధ్రప్రదేశ్ , 14 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం తన భార్య భువనేశ్వరి, మనవడు దేవాంశ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో పూజలు నిర్వహించారు. కుటుంబంతో కలిసి గణేశుడికి పూజ చేయడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని పేర్కొంటూ, ఆయన ఈ సందర్భానికి సంబంధించిన ఫొటోలను ఎక్స్ లో పంచుకున్నారు. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీకని సీఎం గుర్తు చేశారు. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయమన్నారు. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను, ఐక్యతను నేర్పిస్తాయని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande