గాంధీభవన్లో ప్రత్యక్షమైన మాణిక్యరావు థాక్రే
తెలంగాణ కాంగ్రెస్లో ఇన్చార్జ్ మార్పుపై ప్రచారం జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ గాంధీ భవన్లో నిర్వహించిన వినాయక పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్గావు ఠాక్రే అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు.
Telangana Congress

హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ కాంగ్రెస్లో ఇన్చార్జ్ మార్పుపై ప్రచారం జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ గాంధీ భవన్లో నిర్వహించిన వినాయక పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్గావు ఠాక్రే అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు.

దీంతో ఆయన గాంధీ భవన్కు రావడం వెనుక ఏదైనా రాజకీయ కారణం ఉందా? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుత ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను బాధ్యతల నుంచి తప్పించనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే ఆమె ఉన్నత చదువుల కోసం సుమారు 10 నెలల పాటు విదేశాలకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త ఇన్చార్జ్ను నియమించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

 rajesh pande