చిరుతల సంచారంతో ప్రజల ఆందోళన..... 7 జింకలను చంపిన చిరుతలు
అనంతపురంలోని తాటిచెర్లలో 7 జింకలను చిరుతలు చంపాయి. తాటిచెర్లలో టమాటా పంటకు రైతు నరసింహారెడ్డి ఫెన్సింగ్ వేశారు.
Cheetha


ఆంధ్రప్రదేశ్ , 14 సెప్టెంబర్ (హి.స.)అనంతపురంలోని తాటిచెర్లలో 7 జింకలను చిరుతలు చంపాయి. తాటిచెర్లలో టమాటా పంటకు రైతు నరసింహారెడ్డి ఫెన్సింగ్ వేశారు. టమాటా పంట తినేందుకు తోటలోకి ఏడు జింకలు వెళ్లాయి. జింకలను చూసి వేటాడేందుకు రెండు చిరుతలు వచ్చాయి. తోటకు కంచె ఉండటంతో జింకలు తప్పించుకోలేకపోయాయి. చిరుతల సంచారంతో తాటిచెర్ల గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande