ఏపీలో చిరు వ్యాపారులకూ క్రెడిట్ కార్డులు
ఏపీలో చిరు వ్యాపారులకూ బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నాయి. వ్యాపార పెట్టుబడుల కోసం వీరు కనిష్ఠంగా రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.30 వేల వరకు ఈ కార్డుల ద్వారా వినియోగించుకోవచ్చు.
Credit card


ఆంధ్రప్రదేశ్ , 14 సెప్టెంబర్ (హి.స.)ఏపీలో చిరు వ్యాపారులకూ బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నాయి. వ్యాపార పెట్టుబడుల కోసం వీరు కనిష్ఠంగా రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.30 వేల వరకు ఈ కార్డుల ద్వారా వినియోగించుకోవచ్చు. పీఎం స్వనిధి పథకం లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం వంటి ప్రధాన నగరాలతో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో 6.40 లక్షల మంది చిరు వ్యాపారులు ఉన్నారు. వీరంతా ప్రధాన కూడళ్లు, మార్కెట్లలో తోపుడు బళ్లపై వ్యాపారం చేస్తుంటారు. లక్షల కుటుంబాలకు ఇదే ప్రధాన జీవనాధారం. వ్యాపార పెట్టుబడుల కోసం ఇలాంటి వారంతా ప్రైవేట్ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని భారీగా వడ్డీలు చెల్లిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande