సిద్దిపేటలో ఐదున్నర అడుగుల ఎత్తులో ఏకదంతుని రాతి విగ్రహం
సిద్దిపేట జిల్లాలోని వల్లంపట్లలో కాకతీయుల కాలం నాటి ఐదున్నర అడుగుల ఎత్తులో రాతి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది.
Ganesh idols


ఆంధ్రప్రదేశ్ , 14 సెప్టెంబర్ (హి.స.)సిద్దిపేట జిల్లాలోని వల్లంపట్లలో కాకతీయుల కాలం నాటి ఐదున్నర అడుగుల ఎత్తులో రాతి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. సుమారు 20 ఏండ్ల క్రితం దేవతల బావి దగ్గర పడి ఉన్న ఏకదంతుని రాతి విగ్రహంతో పాటు వివిధ దేవతల విగ్రహాలను స్థానికులు పాఠశాల ప్రాంగణంలోకి తరలించారు. అక్కడ నుండి ఏకదంతుని రాతి విగ్రహాన్ని స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం కు తీసుకోవచ్చారు. ఎత్తైన రాతి విగ్రహం ఎదుట పెద్ద రాతి కలశం ఉండేది. రెండు మూడేళ్ల క్రితం ఈ రాతి కలశంను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఏకదంతుని రాతి విగ్రహానికి ఎలాంటి ఆలయంను నిర్మించలేదు. దీంతో వినాయక విగ్రహంతో పాటు పలు దేవతల విగ్రహాలు ఆంజనేయ సమి ఆలయ ప్రాంగణంలో నిర్లక్ష్యంగా పడి ఉన్నాయి. తెలంగాణలోని ఎత్తైన రాతి విగ్రహంగా గుర్తింపు పొందిన బొర్ర పోతన వినాయ కునికి ఆలయం నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande