ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలిపూజ..
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు తొలిపూజలు నిర్వహించారు.
Governor


హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)

చారిత్రక ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ప్రారంభమైంది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు తొలిపూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు విగ్రహ కమిటీ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్లు గవర్నర్కు స్వాగతం పలికి విగ్రహం వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం అర్చకులు గవర్నర్తో పూజలు చేయించారు. ఖైరతాబాద్ గణేశుడికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించగా, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి భారీ కండువా, యజ్ఞోపవీతం సమర్పించారు.ఈ ఏడాది ఖైరతాబాద్ బడా గణేశ్ శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో పర్యావరణ హితంగా ఈ బడాగణేశ్ను నిర్మించారు. ఊత్సవాల కోసం అధికారులు పటిష్టమైన ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో 12 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande