నేడు సాయంత్రం తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో ఇవాళ (సోమవారం) సాయంత్రం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Rain


తెలంగాణ , 14 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణలో ఇవాళ (సోమవారం) సాయంత్రం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతోపాటు ఒకటి రెండు సార్లు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande