
తెలంగాణ , 14 సెప్టెంబర్ (హి.స.)వినాయక చవితి సందర్భంగా గుండు సూదిపై మట్టి వినాయకుడిని తయారుచేసి ఔరా అనిపించారు ఒక యువకుడు. జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరోసారి తన ప్రతిభను చాటారు. ఈ విగ్రహం తయారీకి 10గంటల సమయం పట్టిందని.. దీనిలో గుండు సూది, మట్టి, వాటర్ కలర్స్ వాడినట్లు దయాకర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్