‘టీఆర్ఎస్’ ఇన్ఛార్జిల నియామకం...... ప్రకటించిన కవిత
తెలంగాణ రక్షణ సేన ఇన్ఛార్జిలను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మెదక్ లోక్సభ సహా పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాలకూ అధ్యక్షులను నియమించారు.
Kavitha


తెలంగాణ , 14 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణ రక్షణ సేన ఇన్ఛార్జిలను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మెదక్ లోక్సభ సహా పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాలకూ అధ్యక్షులను నియమించారు. ఆదిలాబాద్, మహబూబ్నగర్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, నిర్మల్, ఖానాపూర్, అంబర్పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, హుజూరాబాద్, పటాన్చెరు, దేవరకొండ, నాంపల్లి, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు పార్టీ బాధ్యుల్ని నియమించారు. ఇప్పటికే 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలను ప్రకటించిన కవిత.. తాజా ప్రకటనతో కలిపి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు బాధ్యుల నియామకం పూర్తి చేశారు. తొమ్మిది జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులతో పాటు మూడు జిల్లాలకు ప్రధాన కార్యదర్శులను కూడా కవిత నియమించారు. అనుబంధ విభాగాలైన ఎంబీసీ, న్యాయ, ఎన్ఆర్ఐ, ట్రేడ్ అండ్ కామర్స్, విద్యార్థి, సోషల్ మీడియా, ముస్లిం మైనార్టీ, రైతు, బంజారా, జర్నలిస్ట్, ట్రేడ్ యూనియన్ విభాగాలకు కూడా అధ్యక్షులను ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande