
తెలంగాణ , 14 సెప్టెంబర్ (హి.స.)వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతికి అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. గవర్నర్ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికి స్వామివారి వద్దకు తీసుకెళ్లారు. గవర్నర్ దంపతులు పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ గణనాథుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి భారీ కండువా, యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. తొలి పూజ అనంతరం బడా గణేశ్ దర్శనానికి భక్తులను అనుమతించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్కు తరలివచ్చారు. దీంతో పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్