మూసీ రిజర్వాయర్కు పెరుగుతున్న వరద
ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నల్గొండ జిల్లాలోని మూసీ రిజర్వాయర్కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
Moosi reservoir


నల్గొండ, 14 సెప్టెంబర్ (హి.స.)

ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నల్గొండ జిల్లాలోని మూసీ రిజర్వాయర్కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.

దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రిజర్వాయర్కు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైన సమయంలో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం (FRL) 645 అడుగులు కాగా, ప్రస్తుతం 638.30 అడుగుల నీటిమట్టం నమోదైంది. రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.84 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో రిజర్వాయర్కు 5,200 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande