ప్రతిపక్షాల విమర్శలకు అభివృద్దే నిదర్శనo.. మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ పట్టణంలో రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు.
Minister


నారాయణపేట, 14 సెప్టెంబర్ (హి.స.) మక్తల్ పట్టణంలో రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ ప్రాంతాన్ని మంత్రి సందర్శించి, నిర్మాణ పనుల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గంలో సహజ వనరులు అన్నీ ఉన్నా, వాటిని ఉపయోగించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్ల సాగు, విద్య, వైద్య రంగాల్లో పూర్తిగా వెనుకబడి పోయిందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

వెనుకబడుతున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి వారినే ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా చట్టసభకు ఎన్నుకోవడం వల్ల రెండున్నర సంవత్సరాల కాలంలోనే దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన పనులను మంజూరు చేసుకున్నామని తెలిపారు. అందులో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని, ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ స్కూల్, 150 పడకల ఆసుపత్రి నిర్మాణంతో ప్రతిపక్షాల విమర్శలకు అభివృద్దే నిదర్శనమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

మక్తల్ అభివృద్ధిలో మరో కీలక అడుగుగా రూ.250 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ నిలవనుందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మక్తల్ ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ను, అధికారులను మంత్రి ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande