
అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)
కాకినాడ జిల్లా పిఠాపురంలో విషాదం చోటుచేసుకుంది. గణపతి విగ్రహం ఏర్పాటు పనుల్లో భాగంగా కోనేరులోకి దిగిన యువకుడు జారిపడి మృతి చెందాడు.
కందరాడ గ్రామానికి చెందిన ధనకొండ సాయి(22) ఆదివారం రాత్రి గణపతి విగ్రహం ఏర్పాట్లలో పాల్గొన్నాడు. విగ్రహం ప్రతిష్టించడానికి ముందు పవిత్ర జలాల కోసం సోమవారం తెల్లవారుజామున స్నేహితులతో కలిసి పాదగయకు వెళ్లాడు. అక్కడి కోనేరులోని నీళ్లు తీసుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు.
స్థానికంగా ఉన్న రెస్క్యూ టీమ్ సాయి మృతదేహాన్ని వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ