లైంగిక నేరగాళ్లపై ఏపీ పోలీసుల ప్రత్యేక నిఘా
రాష్ట్ర పోలీసు విభాగం మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, లైంగిక నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతోంది. ఇలాంటి కేసుల్లో శిక్షలు పడినవారు, నిందితులపై లైంగిక నేరగాళ్ల షీట్లు (సెక్సువల్ అఫెండర్ షీట్లు) తెరుస్తోంది.
AP Police


ఆంధ్రప్రదేశ్ , 14 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్ర పోలీసు విభాగం మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, లైంగిక నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతోంది. ఇలాంటి కేసుల్లో శిక్షలు పడినవారు, నిందితులపై లైంగిక నేరగాళ్ల షీట్లు (సెక్సువల్ అఫెండర్ షీట్లు) తెరుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకూ 3,207 మందిపై ఈ షీట్లు తెరిచారు. 2012 నుంచి 2024 వరకూ 12 ఏళ్లలో 2,589 మందిపై ఈ షీట్లు తెరవగా 27 నెలల్లోనే అంతకంటే ఎక్కువ మందిపై ఈ షీట్లు నమోదుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5,796 మందిపై ఈ షీట్లున్నాయి. శిక్షలు పడినవారు, నిందితుల పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఫొటో, గతంలో వారిపై నమోదైన లైంగిక నేరాల కేసులు, ఏయే పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి? ఆయా కేసుల ప్రస్తుత స్థితి, బెయిల్పై ఉన్నారా, జైల్లో ఉన్నారా తదితర వివరాలన్నింటినీ వీటిలో పొందుపరుస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande