అంబేద్కర్ విగ్రహం పెట్టడం కాదు, ఆయన సూచనలను పాటించాలి.. మహేష్ కుమార్ గౌడ్
దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని, ఆయన్ను దళిత సమాజం ఎప్పటికీ క్షమించదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
Tpcc


హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)

దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని, ఆయన్ను దళిత సమాజం ఎప్పటికీ క్షమించదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

ఏనాడు కేసీఆర్ దళితులను పట్టించుకోలేదని ఓట్ల కోసమే దళితకార్డు వాడారన్నారు. దళితులపై టీఆర్ఎస్ 2003 డాక్యుమెంట్ను ఎందుకు అమలు చేయాలేదని నిలదీశారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధును పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

అంబేద్కర్ విగ్రహం పెడితే కాదు ఆయన సూచనలు పాటించాలన్నారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. మాక్ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు బీసీకి సీఎం పదవిని ఇచ్చారు. కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తలసానిని ప్రతిపక్ష నేత చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎలాగు అసెంబ్లీకి రావట్లేదు తలసానిని ప్రతిపక్ష నేతగా చేయాలని ప్రతిపక్ష నేత హోదా బీసీ నేతలకు ఇస్తామంటే సస్పెన్షన్ ఎత్తివేయిస్తామన్నారు. కొండా సురేఖను హైకమాండ్ పిలిచినట్లు మాకు సమాచారం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు కబ్జా చేసినా అవి బయటకు రావాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande