ఎమ్మిగనూరులో ప్రజలను ఆకట్టుకుంటున్న గోల్డ్ గణపతి
ఎమ్మిగనూరు పట్టణంలో శక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్ వినాయక విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. స్వామివారికి కిలో బరువున్న బంగారు ఆభరణాలతో పాటు కిలో బంగారు నాణేలతో అలంకరించారు.
Gold ganesh


ఆంధ్రప్రదేశ్ , 14 సెప్టెంబర్ (హి.స.)ఎమ్మిగనూరు పట్టణంలో శక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్ వినాయక విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. స్వామివారికి కిలో బరువున్న బంగారు ఆభరణాలతో పాటు కిలో బంగారు నాణేలతో అలంకరించారు. వినూత్నంగా కొలువు దీరిన గణేశుడికి మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణ అలంకరణలో ఉన్న గణనాథుడిని దర్శించకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వర్షాలు సంవృద్దిగా కురిసి అందరూ బాగుండే విధంగా గణపయ్య ఆశీర్వదించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కోరారు. కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ఆమె పూజలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande