ఎయిర్ఇండియా సీఈవోకు కేంద్రం సమన్లు..
ఎయిర్ఇండియా సీఈవోకు కేంద్రం సమన్లు..
Air India


న్యూఢిల్లీ, 15 సెప్టెంబర్ (హి.స.)

ముగ్గురు విదేశీయులు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే దేశం విడిచి వెల్లిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ అంశంలో ఎయిర్ఇండియా సీఈవోకు కేంద్రం సమన్లు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా సీఈఓను వివరణ కోరుతూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 4న ముగ్గురు ఇటాలియన్ పౌరులు అమృత్సర్ నుంచి ఢిల్లీకి వచ్చి, గంటలోపే ఢిల్లీ నుంచి లుఫ్తాన్సా కోడే షేర్ విమానంలో మ్యూనిచ్కు వెళ్లారు. అయితే ఢిల్లీలో తప్పనిసరి ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సీఈవోకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ ఘటనపై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. పౌర విమానయాన శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, ఢిల్లీ విమానాశ్రయ అధికారులు సమావేశానికి హాజరై, ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande