కర్ణాటకలో విషాదం.......ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు సజీవ దహనం
కర్ణాటకలోని బెలగావిలో విషాదం చోటుచేసుకుంది. కొత్త ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు సజీవ దహనమయ్యారు.
Fire accident


ఢిల్లీ , 15 సెప్టెంబర్ (హి.స.)కర్ణాటకలోని బెలగావిలో విషాదం చోటుచేసుకుంది.

కొత్త ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను భారతి దమోనే (50), శారద దమోనే (45), గంగా దమోనే (25), ప్రియా దమోనే (24)గా గుర్తించారు. వీరంతా ఘటనాస్థలంలోనే మృతి చెందారు. గజానన్ దమోనే (65), రోషన్ దమోనే (21) తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande