
న్యూఢిల్లీ, 15 సెప్టెంబర్ (హి.స.)
భారతీయ చట్టాలకు లోబడి, పిల్లలపై లైంగిక వేధింపులు, ఇతర వేధింపులకు సంబంధించిన కేసులను నేరుగా సంబంధిత భారతీయ పోలీసు, దర్యాప్తు సంస్థలకు నివేదించడానికి మెటా అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దేశంలో ఏ సోషల్ మీడియా వేదిక అయినా కార్యకలాపాలు నిర్వహించాలంటే చిన్నారుల డిజిటల్ భద్రతే ప్రాథమిక సూత్రమని, ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇటీవల మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్లో చిన్నారులపై లైంగిక వేధింపుల ప్రచార ప్రకటనలు (CSEAM) కనిపిస్తున్నాయంటూ బీబీసీ ఐ (BBC Eye) నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. దీని ఆధారంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) విచారణ చేపట్టగా, సెప్టెంబర్ 9న మెటా ఇండియా ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి ముందే జూలై నెలలోనూ కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేస్తూ, అభ్యంతరకర కంటెంట్ను వెంటనే తొలగించాలని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..