దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎంతసేపూ దేశం మనకేం చేసిందో కాకుండా దేశానికి మనం ఏం చేయగలమో ఆలోచించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యువతకు పిలుపునిచ్చారు.
Nirmala


చెన్నై, 15 సెప్టెంబర్ (హి.స.)

ఎంతసేపూ దేశం మనకేం చేసిందో కాకుండా దేశానికి మనం ఏం చేయగలమో ఆలోచించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యువతకు పిలుపునిచ్చారు.

జెన్ జీ, జెన్ ఆల్ఫా చెప్పేది వినేందుకు మేం సిద్ధమేనని అయితే మీరు మిమ్మల్ని జెన్ జెడ్ అని పిలుచుకున్నా, జెన్ ఆల్ఫా అని పిలుచుకున్నా, మీరందరూ చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీ చుట్టూ ఏం జరుగుతోంది?మీ పాత్ర ఏమిటి? మీ ద్వారా దేశానికి ఏమి సాధించవచ్చు అనే విషయాలపై మీరు తప్పక ఆలోచించుకోవాలని పేర్కొన్నారు.

మంగళవారం చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జెన్ జెడ్ (Gen Z), జెన్ ఆల్ఫా తరాలకు చెందిన యువత నాయకత్వ బాధ్యతలను స్వీకరిస్తూ దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

పట్టభద్రులవుతున్న విద్యార్థులు వారి వారి రంగాలలో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని నిర్మలా సీతారామన్ కోరారు. మీరు నాయకత్వం వహించాలి, దేశానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దేశం సురక్షితంగా, బలంగా ఉన్నప్పుడే మనం నివసించడానికి ఒక ఇల్లు ఉంటుంది. మనం మన దేశాన్ని ఎన్నటికీ వదులుకోకూడదని సూచించారు. రష్యా-యుక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు వంటి ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధించి స్థిరంగా ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరిగిన ఉపాధి అవకాశాలను వివరిస్తూ శ్రీపెరంబుదూర్-ఒరగడం కారిడార్ నేడు ఆటోమొబైల్, స్మార్ట్ ఫోన్ ఎగుమతులకు ప్రపంచ కేంద్రంగా మారిందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande