
న్యూఢిల్లీ, 15 సెప్టెంబర్ (హి.స.)
భారతదేశ విదేశీ వాణిజ్య రంగంలో
పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2026 ఆగస్టు నెలలో దేశ వస్తువుల ఎగుమతులు అద్భుతమైన వృద్ధిని నమోదు చేయగా, వాణిజ్య లోటు కొంత తగ్గుముఖం పట్టినట్లుగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే, ఈ నెలలో వాణిజ్య లోటు స్వల్పంగా తగ్గి 26.86 బిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే నెలలో 27.20 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇక జూలై నెలలో నమోదైన 31.98 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఆగస్టులో లోటు గణనీయంగా తగ్గడం విశేషం.ఆగస్టు నెలలో దేశీయ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 26.1 శాతం బలమైన వృద్ధితో 43.81 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి.
ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, వస్త్రాలు ఎగుమతుల వృద్ధికి తొడ్పడ్డాయి. ఈ క్రమంలోనే దేశ దిగుమతులు 14.1 శాతం పెరిగ 70.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2026 ఆగస్టులో కేవలం 2.3 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకున్నారు. క్రితం ఏడాది ఇదే నెలలో బంగారం దిగుమతులు 5.4 బిలియన్లుగా ఉండగా, దానితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 57.7 శాతం మేర భారీ తగ్గుదల నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు