
న్యూఢిల్లీ, 15 సెప్టెంబర్ (హి.స.)
యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక
ఆదేశాలు జారీ చేసింది. రూ.2వేల వరకు యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.
యూపీఐ చెల్లింపులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు వ్యాపారుల నుండి, కస్టమర్ల నుండి ఎలాంటి రుసుము వసూలు చేయవద్దని ఆదేశించింది.
అంతేకాకుండా రూ.2వేల వరకు రూపే డెబిట్ కార్డు చెల్లింపులపై సైతం ఛార్జీలు లేవని పేర్కొంది. రూ.2వేలు దాటిన కొన్నిరకాల వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్)ను పరిశీలిస్తున్నట్టు తెలిపింది.
ఎండీఆర్ అంటే డిజిటల్ చెల్లింపు లావాదేవీలను ప్రాసెస్ చేసినందుకు వ్యాపారులు బ్యాంకులకు మరియు సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. ప్రస్తుతం, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నుండి పేమెంట్ చేసినప్పుడు వ్యాపారులు అదనంగా వసూలు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..