గురుగ్రామ్ బైక్ ఆక్సిడెంట్...... లేడీ బైకర్ను ఢీకొన్న కార్ డ్రైవర్ అరెస్టు
గురుగ్రామ్లో ఆదివారం గోల్ఫ్ కోర్సు రోడ్డులో జరిగిన ఆక్సిడెంట్ పై పోలీసులు స్పందించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Gurugram bike accident


ఢిల్లీ , 15 సెప్టెంబర్ (హి.స.) గురుగ్రామ్లో ఆదివారం గోల్ఫ్ కోర్సు రోడ్డులో జరిగిన ఆక్సిడెంట్ పై పోలీసులు స్పందించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్పై వెళ్తున్న ఓ మహిళ రైడర్ను.. కారుతో ఓ వ్యక్తి ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు, కారు డ్రైవర్ కళ్యాణ్ బైన్సాల్ను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్లోని దౌసాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గురుగ్రామ్ పోలీసులు ఈ కేసులో చర్యలు తీసుకున్నారు. నిందిత డ్రైవర్పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

ఓ తెలుపు రంగు సెడాన్ కారు .. బైక్ నడుపుతున్న రైడర్ సియాను ఢీకొట్టింది. కారు ఢీకొన్న తర్వాత ఆ లేడీ బైకర్ కింద పడిపోయింది. ఏప్రిల్లా ఆర్ఎస్ 457 స్పోర్ట్స్ బైక్లో వెళ్తున్న సియాను కారు డ్రైవర్ కళ్యాణ్ వెంబడించి మరీ ఢీకొట్టాడు. కారు, బైక్ ఢీకొన్న సీసీటీవీ దృశ్యాలు వైరల్ అయ్యాయి. రాజ్ఘర్లో నిందిత కారు డ్రైవర్ను అరెస్టు చేసినట్లు గురుగ్రామ్ సీపీ సిబాశ్ కబిరాజ్ తెలిపారు. బీఎన్ఎస్ సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గోల్ఫ్ కోర్సు రోడ్డుపై మహిళా బైకర్ను కారు ఢీకొట్టిన ఘటనను సుమోటోగా స్వీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సెక్టార్-56 పోలీసు స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. లోతైన దర్యాప్తు, సీసీటీవీ ఫూటేజీ విశ్లేషణ తర్వాత హత్యాయత్నం కేసు బుక్ చేసినట్లు పోలీసులు చెప్పారు. దక్షిణ ఢిల్లీలోని కాల్కాజీలో ఉన్న బాధితురాలి ఇంటిని పోలీసు అధికారి మనోజ్ కుమార్ విజిట్ చేశారు. లేడీ బైకర్ను ఢీకొట్టిన ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande